జీవిత సాక్ష్యము:
A) ప్రభువు నందు ప్రియమైన వారందరికి నా యొక్క హృదయ పూర్వక వందనములు. ప్రభువు అనుగ్రహించిన కృపను బట్టి ఈ నా జీవిత సాక్ష్యమును పంచుకొనుచున్నాను.నేను 1969 సం||రము జనవరి 1వ తేది నాడు దేవరపల్లి బెంజిమిన్, నాగరత్నం దంపతులకు 4వ కుమారునిగా జన్మించితిని. మా యొక్క తండ్రి కాంపౌండర్గాను, తల్లి నర్సుగాను ఎనికేపాడు, విజయవాడ రూరల్ డిస్పెన్సరీ నందు పని చేసినారు.
B) విద్యాభాస్యం : నా యొక్క బాల్య విద్యాభ్యాసము 5వ తరగతి వరకు కృష్ణా జిల్లా ఎనికేపాడులోన, 10 తరగతి వరకు తోట్లవల్లూరు నందును,ఆటోమొబైల్ డిప్లొమా గవర్నమెంటు పాలిటెక్నిక్ ఒంగోలు నందు చేసితిని.
C) పని : టాటా డుజిల్ వెహికిల్స్ నందు ట్రైనీ గా, విజయభారతి ఐ.టి.ఐ. గౌతమి, ఐ.టి.ఐ గవర్నమెంటు ఐ.టి.ఐ., విజయవాడ నందు ఇన్‌స్ట్రక్టర్‌గా పని చేయుచూ ఇన్సూరెన్స్ సర్వేయర్గా లైఫ్ సెటిల్ చేసుకుందామని ప్రయత్నించుచుంటిని. ఆ సమయంలో ప్రభువు దర్శనములో 6 సార్లు మత్తయి సువార్త 6:19 చదువుమని చెప్పినాడు.
D) 1) దర్శనములు 1 : 1987 సం||రము ఒంగోలు లోని హాస్టల్‌లో ఉండగా దర్శనములో ఒక వ్యక్తి నన్ను లేపి బయటకు తీసుకొని వెళ్ళినపుడు దేవుని దూతలూ ”సర్వలోక” నాధుడగు యేసు నాధుడు త్వరలో రానై యున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా అని గానాప గానాలు చేయుచూ ఆకాశములో విహరిస్తూ పాట పాడుచున్నారు. సింహసనము మీదా ఒక వ్యక్తి తెల్లని వస్త్రములు ధరించి (యెషయా 6:1-8)ప్రకారం దర్శనము చూసాను. ఆ వ్యక్తి నాతో ”కోతెంతో విస్తారముగా ఉన్నది కోసేవారు కావాలి” (లూకా 10:2) నాతో 3 సార్లు చెప్పియున్నాడు.
2) దర్శనములు 2:నేను బాల్యము నుండి ఎనికేపాడు సి.ఎస్.ఐ, దైవ స్వరూపి ,ఒంగోలు లో baptist, hebrone చర్చీలకు వెళ్ళుచుండెడివాడను. 1989 సంవత్సరమునందు ప్రభువు మాట్లాడుతాడని తోట్లవల్లూరు పొలమునందు ప్రార్ధించి పండుకొని యుండగా, భూమిలో నుండి ఒక స్వరము ”స్త్రీ కనిన నరులలో యోహాను కంటే గొప్పవాడెవడు లేడు. అయినను దేవుని రాజ్యములో అల్పుడైనవాడు అతని కంటే గొప్పవాడగును. (లూకా 7:28) మరణము వరకు నమ్మకముగా ఉండుము. నేను నీకు జీవకిరీట మిచ్చెదను (ప్రకటన 2:10) లేచి చదువు అని ఒక స్వరము వింటిని. ఎటు చూచినను నాతో ఎవరునూ లేరు.
3) దర్శనములు 3:దర్శనములో ఆకాశము నుండి ఒక గొలుసు భూమి మీదకి వచ్చి ఒక బావిలో ఉన్న రాయిని ఆకర్షించి ఆ రాయిని, బయటకు తీసి, ఆకాశములోనికి తీసుకొని వెళ్ళుచుండగా ఒక కాకి గొలుసు చేత ఆకర్షింపబడిన రాయిని కొట్టగా ఆ రాయి క్రిందపడుచున్న సమయంలో వెంటనే ఆకాశము నుండి వచ్చిన గొలుసు ఆ రాయిని ఆకర్షించి ఆకాశ మండలమునకు కొని పోయి ఒక దేవాలయ కట్టడములో నిలువబెట్టెను. 1 పేతురు 2:4-10; 1 కొరింథీ 3:12; ప్రకటన 2:17, 1 తిమోతి 2:20
E) ఆత్మీయ ప్రయాణము : 1990 సం||రము ఎనికేపాడు సంసొను అయ్య గారి ద్వారా బాప్తీస్మము తీసుకొింటిని. నేను దేవుని సేవ చేయాలని ఎన్నో దర్శనములలో ప్రభువు చూపిస్తూ ఉండేవారు. దేవుని దూతలు నాతో మాట్లాడుచూ ఉండేవారు. ”యెహోవా ఎన్నుకొను వారులారా” ఏతెంచుడి. దేవునిని సేవించుటకు జనులు కావలెను (మీకా 4:5) కీర్తనలు 50:5, 6.
F) నాకు పరలోక రాజ్యవారసుడనని నాతో వాగ్దానము చేయుమని అడిగినపుడు 1995 సం|| మే నెల 15వ తారీఖున మత్తయి 11:27 వాగ్దనం యిచ్చారు. నీవు నన్ను ఎరిగియుంటే నాకు కనిపించుమని ప్రార్థన చేయగా యోహాను 3:8 చదువుమని వాగ్దానం చేసారు.
G) ”కాళ్ళు గాని చేతులు గాని పోగొట్టుకొనుట కంటే నీవు దేవుని మాట వినుట నీకు మేలు” అని కలలో 4 సార్లు అక్షరములు చూసాను.
H) ”క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను”. రోమా 5:6; హెబ్రీ. 11:24, 11:6, రోమా 8:1.
I) దర్శనములు, కలలో కాకుండ కళ్ళు తెరచి ఉండగా మాట్లాడితే నేను సేవ చేయుదునని అడిగాను. హృదయ శుద్ధి గలవారు దేవుని చూచెదరు అన్నావు గదా ! నీవు నాకు కనిపించు లేదా నా పాపము ఎదైనను తెలియపర్చుము అని ప్రార్థించితిని ప్రభువు నాతో ,నేను గాలిలాగా ఉన్నాను యోహాను 3:8 చదువుమని వాగ్దానం చేసారు.నేను ఈ నేత్రములతో చూడనిదే, నా చెవులతో విననిదే (1 యోహాను 1:1) నేను హైదరాబాద్,నీ సేవ కొరకు సాక్షిగా వెళ్ళను, నా వల్ల కాదు. నన్ను విడిచిపెట్టు. ఏ విధాము చేతనైనను నీ కొరకే జీవించెదననగా.ప్రభువు నాతో
1. ఉపవాసముండు ప్రార్థించాలి,
2. నిద్రను జయించి ప్రార్థించాలి
3. నిద్రను జయించుటకు దేవుని నామమును పదేపదే సార్లు స్తుతించాలి. ఎలా స్తుతించాలో తెలియపర్చుమనగా.
జీవము గల దేవా నీకు వందనాలు,జీవాదిపతి నీకు వందనాలు, సర్వాదికారి నీకు వందనాలు, సర్వ శక్తిమంతుడా నీకు వందనాలు, పరిశుద్దాుడా నీకు వందనాలు, పరిశుద్ధ ఆత్మ దేవా నీకు వందనాలు,ఆశ్చర్యకరుడా నీకు వందనాలు, బలవంతుడా నీకు వందనాలు, సత్యస్వరూపి నీకు వందనాలు అని పదే పదే సార్లు ఆయన నామమును స్తుతించాలి అని చెప్పారు.
J) నేను కళ్ళు తెరచియుండగా దేవదూతలు నా గురించి ప్రార్థించుట వినేవాడను. సుమారు 4 సార్లు విన్నాను.
మొదటి దూత రక్షించుమని,
2వ దూత కాపాడుమని,
3వ దూత ఆదరించుమని,
4వ దూత దిక్కునీవే,
5వ దూత దయ చూపించు.
5 గురు దేవదూతల ప్రార్థన : 1. రక్షించు, రక్షించు, రక్షించు
2. కాపాడు, కాపాడు,కాపాడు, కాపాడు
3. ఆదరించు, ఆదరించు, ఆదరించు
4. దిక్కునీవే, దిక్కునీవే, దిక్కునీవే
5. దయ చూపించు, దయ చూపించు, దయ చూపించు
K) వాగ్దానములు : జాబ్ చేస్తూ సేవ చేస్తానని చెప్పినపుడు ప్రభువు నాతో 24 గంటలు. నా సేవలో సాక్షిగా జీవించాలని చెప్పారు. 1 యోహాను 2:15; యోహాను 15:3; ఎఫేసి 2:8; 2 కొరింథీ 8:9; రోమా 8:1.
L) నేను విజయవాడ ప్రదేశములో సేవ చేస్తానని అని అడిగినపుడు నేను చూపించు ప్రదేశము వెళ్ళుమని చెప్పారు.హైదారాబాదులోని OU యూనివర్శిీటి అని చాలాసార్లు చెప్పారు.సి.బి.ఎస్. దిగి 3వ నెంబర్ బస్సు ఎక్కి విద్యానగర్‌లో ఉండుమని తెలిపారు.
M) ఆహారము, వస్త్రములు ఎలా అని అడిగినపుడు గలతీ 4:12; మత్తయి 6:33; కీర్తనలు 34:10; హబక్కుకు 3:2; మత్తయి 28:20; రోమా 4:8; ధ్యానించుమని,నిన్ను ఏ విధముగా ఎన్నుకొన్నానో నిన్ను పోషించు వారిని ఏర్పాటు చేసుకొనినాను అని చెప్పారు.
N) నేను డీజిల్ మెకానిక్ సబ్జెక్ట్స్ చెప్పేవాడిని గాదా ! నాకు బైబిల్ ట్రైనింగ∑ లేదు గదా అని అడిగినపుడు; ఏకాంతముగా వెళ్ళి ఆదికాండము నుండి ప్రకటన పుస్తకం వరకు చదవు మని, నా మనస్సు తెలుసుకోమని ప్రభువు తెలిపారు.మనుష్యుల దగ్గర కాదు నా దగ్గరనే నేర్చుకొనుమని తెలిపారు. 1 యోహాను 2:27; యెషయా 50:4, 5; 1 తిమోతి 3:16; 1 తిమోతి 3:16; 2 తిమోతి 2:1; యెషయా 11:2;గలతీ 1:10-12; 2 తిమోతి 1:7; 1 కొరింథీ 1:5-9.
O) 1995 సం||లు జూన్ నెల 15వ తేదీన ప్రభువు ఒక దైవజనుని రూపములో వచ్చి నూనెతో అభిషేకము చేసెను. హెబ్రీయులకు 1:9 మరియు కీర్తనలు 119:98-104 చదువుమని తెలిపెను. 1995 సం||లు జూలై 3వ తేదీన దైవజనులందరిని పిలిచి అభిషేకము నొందితిని.
P) 1995 సం||ము జూలై 5వ తేదినాడు ప్రభువు మాట ప్రకారము విద్యానగర్, హైదారాబాదు వచ్చితిని. 1997 సం||ము ఆగస్టు 14వ తేదీన జంపన, అరుణతో (కీర్తనలు 31:12; సామెతలు 12:4) వివాహము, 1999 సం|| నవంబర్ 25న దేవుడు పాల్ జాషువాను(ఆశీర్వాదము) మరియు 2001 సం|| డిసెంబర్ 17వ తేదీన జాయిస్ షారోన్(ఆనంధము) దేవుడు బహుకరించియున్నాడు.
Q) సాతానుని జయించుటకు ధ్యానించవలసిన వాగ్దానములు యాకోబు 4:7; 1 యోహాను 4:8; 1 పేతురు 5:8; రోమా 16:20; కీర్తనలు 56:3, 4; 4:18; 91:13; నెహుము 2:1; లూకా 10:19, 20; యిర్మియా 4:7, 8; మార్కు 16:17, 18.
R) 1996 సం|| ఆగస్టు 17వ తేదీన మా ఆత్మీయ కుమారుడు డి. సమూయేలును కర్నూలు జిల్లా ఆత్మకూరుకు అభిషేకము చేసి ప్రభువు సెలవిచ్చిన విధాముగా పంపియున్నాము. దేవుడను గ్రహించిన వాగ్దానములు యోహాను 4:24; ఎఫేసి 1:3. 2010 సం|| అక్టోబరు 10వ తేదీన చక్రవర్తి పాల్‌ను అభిషేకించి గుంటూరు పట్టణము పంపించుమని ప్రభువు తెలిపియున్నారు.
S) దేవుని స్వరము ద్వారా పొందిన వాగ్దానములు. 2 తిమోతి 1:7; సామెతలు 28:20; కీర్తనలు 84:11; సామెతలు 10:24. నీతిమంతుడు ఆశించునది వానికి దొరుకును. వివేకము గల నాయకుడవై యుద్దము చేయుము. సామెతలు 20:18.
T) 2001లో పితరుల దోషముల విడుదల :- భక్తి జీవితములో 3 స్టేజస్ గూర్చి ప్రభువు చెప్పుట.
1. దాసులు (లూకా 17:7-10);
2. స్వతంత్రులు (యోహాను 8:36);
3. నమ్మకస్తులు (మత్తయి 21:28-30).
2004 సం||లో నేను చింతించుచుండగా ప్రభువు నాతో ఎల్లప్పుడు ఆనందముగా ఉండుము. నీకు ఏ సమయులో ఏది కావలయునొ. నీవు అడుగకుండనే నేను నీకిచ్చెదను. 2 కొరింథీయులకు 4:15.
U) 2004 సంవత్సరము 2nd డిసెంబర్‌న ప్రభువు మాటను బట్టి జీసస్ పవర్ పరిచర్యలు (జీసస్ పవర్ మినిస్ట్రీస్) ప్రారంభించుట జరిగింది. యెషయా 54:14,30:23.
V) 2009 సెప్టెంబర్ 17న జీసస్ పవర్ పరిచర్యలు ట్రస్టు (జీసస్ పవర్ మినిస్ట్రీస్ ట్రస్టు)ను ప్రారంభించాము. దేవుని కృపను బట్టి దేవుడు 2004లో వాగ్దానము చేసిన విధముగా మా నివాసము మరియు ప్రేయర్ హాల్‌తో (ఇ.నెం. 2-2-1/18/ఎ, అంజయ్యనగర్, విద్యానగర్, హైదారాబాద్-500 044.) నందు దేవుని పనిని దేవుని చిత్త ప్రకారం కొనసాగించుచున్నాము.
నా పని :- దేవుడు మట్లాడాలని ఆశ కల్గిన వారికి ఆయన స్వరము వినుటకు ఆశ కల్గిన వారికి మా పూర్తి సహకారము అందించగలము. ఏలయనగా, ఆయన సజీవుడు (లూకా 24:5). ఆయన మట్లాడె దేవుడు, ఆయన రాజ్యపరులుగాను (ప్రకటన 1:18). ఆయన రాజ్యములో ధనవంతులుగా చేయును (మత్తయి 5:19). దానియేలు 12:3; యెషయా 59:1-3; అపో.కా. 2:17;
పూర్తి వివరములకు మా అడ్రస్సు :- దైవజనులు డి. సువర్ణరాజు, Founder and Pastor (Jesus Power Ministries Trust).